కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన బుర్ర రవితేజ గౌడ్.
రాజన్న సిరిసిల్ల, ( ప్రజాబలం ), రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సరియైన అ నుమతుల్లేకుండా తగిన అర్హత లేని, అద్దె డాక్టర్లతో ఆసుపత్రులను నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు ఆసుపత్రులను మూసి వేయించండి అని కోరుతూ టీపీసీసీ లీగల్ డిపార్ట్మెంట్ కన్వీనర్ బుర్ర రవితేజ గౌడ్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, అర్హత లేని అర కొర సిబ్బంది మరియు సదుపాయాలతో, పరిమితికి మించి న పడకలు ఏర్పాటు చేసి, నాసిరకం వైద్యం చేస్తున్న ఆసుపత్రులపై తక్షణమే తగిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇటీవల ఒకరు ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వస్తే చేయాల్సిన ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించకపోవడం వలన సాయంత్రం గుండె జబ్బుతో మరణించారని తెలిపారు. మనిషి జీవించే హక్కు రాజ్యాంగం కల్పిస్తున్నందున, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రమాణాలు పాటించని అనుమతులు పొందని సంబంధిత ఆసుపత్రులను తక్షణమే నివారించాలని ఆయన కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు.