ముస్తఫాను ఓదార్చిన మంత్రి పొంగులేటి

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 4 (ప్రజాబలం) ఖమ్మం కాంగ్రెస్ జిల్లా మైనారిటీ నాయకులు మహమ్మద్ ముస్తఫా తండ్రి ఘని అనారోగ్యంతో ఆదివారం ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందగా.. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు పొoగులేటి శ్రీనివాసరెడ్డి ముస్తఫా ను ఓదార్చారు. హాస్పిటల్ కు వెళ్లి మృతదేహాన్ని సందర్శించి నివాళుల ర్పించారు. ఈ సందర్భంగా ముస్తఫా, ఆయన సతీమణి, కార్పొరేటర్ రఫీదా బేగం కు మంత్రి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి వెంట క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య నాయకులు మిక్కిలినేని నరేంద్ర, మియా భాయ్, యువజన నాయకులు ఉత్తేజ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking