తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికల కొరకు నోటిఫికేషన్ విడుదల

 

ఆగష్టు 11 నుంచి నామినేషన్ల స్వీకరణ,

18 న ఎన్నికలు. అదే రోజు సాయంత్రం ఫలితాలు

ఎన్నికల అధికారి యు.వెంకటయ్య

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 4 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ ను ప్రకటించినట్లు ఎన్నికల అధికారి యు.వెంకటయ్య,సహాయ ఎన్నికల అధికారి ఎం.డి.సాబేర్ పేర్కొన్నారు.ఆదివారం ఖమ్మం నగరం లోని సంఘం కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ,తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి జహంగీర్అలీ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ను విడుదల చేసినట్లు తెలిపారు.ఈనెల (ఆగష్టు)11 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరణ,అదే రోజు సాయంత్రం 5 గంటల లోపు విత్ డ్రా వుంటుందని,సాయంత్రం 5 గంటల తరువాత అధ్యక్ష పోటీలో ఉన్న వారికి గుర్తులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.18 వ తేదీన ఆదివారం ఖమ్మం నగరం లోని సంఘం కార్యాలయం లో ఉదయం 9 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల లోపు ముగుస్తుందని,సాయంత్రం 4 గంటల లోపు ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు.ఈ ఎన్నికల లో పోటీ చేసే అభ్యర్థులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం లో వరుసగా మూడు సంవత్సరాల నుండి సభ్యత్వం పొంది ఉండాలని తెలిపారు.ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర సంఘం అధ్యక్షులు ఎం.డి జహంగీర్ అలీ,ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మల్లేశం హా జరు కానున్నట్లు తెలిపారు.ఈ ఎన్నికలు శాంతి యుతంగా నిర్వహించడానికి ప్రభుత్వ డ్రైవర్లు అందరూ సహకరించాలని కోరారు.ఎన్నికల నోటిఫికేషన్ సమావేశంలో బి.రామారావు గౌడ్,దాసరి వేణుగోపాల్,కె వెంకటేశ్వర్లు, ఎల్ గంగన్న, బాబురావు, బానోత్ హరి సింగ్,ఎస్ వి ప్రసాద్ ,జి.నాగరాజు, సిహెచ్ నరసింహరావు, జి. సుధాకర్ టి. వెంకటేశ్వర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి వచ్చిన వారు వనమా శ్రీనివాసరావు భద్రాచలం,జి రాఘవులు, వి. నాగరాజు తదిరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking