నెల నెలా వెన్నెల ఏడవ వార్షికోత్సవం

 

హాజరుకానున్న మంత్రులు భట్టి తుమ్మల పొంగులేటి

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 4 (ప్రజాబలం)ఖమ్మం నగరంలో ఆగస్టు 9 ,10, 11 తేదీలలో నెల నెలా వెన్నెల ఏడవ వార్షికోత్సవ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహించనున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు రిటైర్డ్ ఐఏఎస్ కేవీ రమణాచారి భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సంచాలకులు మామిడి హరికృష్ణ వీరితోపాటు స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులు
నాటక రంగ ప్రముఖులు, హాజరు కాబోతున్నారని నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రమణ్యకుమార్ మోటమర్రి జగన్మోహన్రావు డాక్టర్ నాగబత్తిని రవి డాక్టర్ వేల్పుల విజేత వేముల సదానంద్ నామ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు భక్త రామదాసు కళాక్షేత్రం నందు జరిగిన సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగబత్తిని రవి మాట్లాడుతూ అన్నా బత్తుల రవీంద్రనాథ్ కళా సంస్కృతిక సంస్థ ఖమ్మం కళాపరిషత్ ప్రజానాట్యమండలి సంయుక్తంగా భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి నెల నెలా వెన్నెల దిగ్విజయంగా ఏడో వార్షికోత్సవం నిర్వహించుకోవడం సంతోషదాయకమని అన్నారు ఈ కృషిలో భిన్న అభిప్రాయాలతో ఉండే మూడు సంస్థలు ఏకతాటి మీద 84 నెలలుగా అరమరికలు లేకుండా* నిర్వహించడం అసమాన్య విషయమని అన్నారు. మా కృషిని అభినందిస్తూ మా వెన్నంటి నడుస్తున్న ఖమ్మం నగరపుర ప్రముఖులు, ప్రేక్షకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అనధికారులు, నాటక రంగ ప్రముఖులు, నాటక సంస్థలు, కళాభిమానులు, కళాకారులు ముఖ్యంగా మీడియా మిత్రులకు ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. రేపు జరగబోయే కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని కోరారు. ఆర్క్స్ ప్రధాన కార్యదర్శి అన్నా బత్తుల సుబ్రహ్మణ్య కుమార్* మాట్లాడుతూ నెలనెలా వెన్నెల కార్యక్రమం విజయవంతానికి సహకరిస్తున్న కృషి చేస్తున్న అందరికీ హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేశారు. 9 ,10, 11న జరిగేటటువంటి ఆహ్వాన నాటిక పోటీలు ఖమ్మం ప్రేక్షకులను అలరింప చేస్తాయని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి కార్యక్రమం ప్రారంభమవుతుందని రోజు మూడు నాటికలు చొప్పున మూడు రోజులు తొమ్మిది నాటికల ప్రదర్శనలు ఉంటాయని వీటిని సకుటుంబ సపరివారంగా విచ్చేసి తిలకించి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు ఖమ్మం కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి వేల్పుల విజేత మాట్లాడుతూ ఖమ్మం ప్రేక్షకులకు 84 నెలలుగా మా మూడు సంస్థలు జనరంజకమైన సందేశాత్మకమైన సమాజ రుగ్మతలను రూపుమాపే ఇతిహాసాలతో ఉన్న నాటికలను ఎంపిక చేసి వాటిని ఖమ్మం ప్రేక్షకులకు అందిస్తున్నందుకు గర్వకారణంగా ఉందని రేపు జరగబోయే వార్షికోత్సవ ఆహ్వాన నాటిక పోటీలు కూడా అంతకంటే ఎక్కువ స్థాయిలో మన ఖమ్మం నగర ప్రేక్షకులను అలరింప జేస్తాయని అందరూ తప్పక హాజరు కావాలని కోరారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో నిర్వాహకులు అన్నా బత్తుల సుబ్రహ్మణ్య కుమార్, మోటమర్రి జగన్మోహన్రావు, డాక్టర్ నాగబత్తిని రవి, డాక్టర్ వేల్పుల విజేత, వేముల సదానంద్, నామ లక్ష్మీనారాయణ, మారుతి కొండలరావు, చెరుకుపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking