అయ్యప్ప స్వామి మాల ధారణ వేసే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలి

తెలంగాణ అయ్యప్ప జేఏసీ నాయకులు
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:అయ్యప్ప స్వామి మాల ధారణ వేసే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని, హజ్‌ యాత్రకు వెళ్లే వారికి సబ్సిడీ ఏ విధంగా ఇస్తుందో అదే మాదిరిగా శబరి కి వెళ్లే అయ్యప్ప స్వాములకు రాష్ట్ర ప్రభుత్వము రవాణాలో రాయితీ కల్పించాలని, తెలంగాణ అయ్యప్ప జేఏసీ నాయకులు, బాలకృష్ణ నాయిని బుచ్చిరెడ్డి,ప్రేమ్‌ గాంధీ క్యాతం రాధాకృష్ణ లు డిమాండ్‌ చేశారు, ఈ మేరకు ఆదివారం గౌలిపురాలోని అయ్యప్ప స్వామి దేవాలయం ప్రాంగణంలో తెలంగాణ అయ్యప్ప జేఏసీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల, భద్రత, భరోసా బాధ్యత, బాధ్యత అనే అంశంపై అయ్యప్ప స్వాములతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ,,, అయ్యప్ప మాల ధారణ వేసిన వారికి ప్రభుత్వంలోని వివిధ విభాగాలో మాలధరణ వేసిన స్వాములను ఉన్నతాధికారులు వేధింపుల గురి చేస్తున్నారని.. ఇది సరైంది కాదని వారు హెచ్చరించారు, శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాముల కోసం స్పెషల్‌ ట్రైన్లు ఈసారి అదనంగా వేయాలని, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో అయ్యప్ప స్వాములకు సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు, రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయాలకు ఎండోమెంట్‌ శాఖ ఆధ్వర్యంలో వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక బడ్జెట్లను కేటాయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు, ముఖ్యంగా శబరిమలకు వెళ్లే అయ్యప్ప స్వాములకు టోల్గేట్‌ ల ద్వారా మండల, జ్యోతి కి వెళ్లే స్వాములకు ప్రతి ఒక అయ్యప్ప స్వామికి రూపాయిలు 10,000 రూపాయలు అదనంగా టోల్గేట్‌ ఫీజులు వసూలు చేస్తున్నారు వాటిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు, వివిధ నగరాల నుండి శబరిమలైకు పాదయాత్ర ద్వారా వెళ్లే అయ్యప్ప స్వామి భక్తులకు ఆయా దేవాలయాల వద్ద ఎండోమెంట్‌ ఆధ్వర్యంలో టాయిలెట్లు విశ్రాంతి గదులు భోజన వసతిని,ఏర్పాటు చేయు విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు, తెలంగాణ అయ్యప్ప జెసి ఆధ్వర్యంలో ప్రతిపాదించిన డిమాండ్ల పరిష్కారం కోసం తమ న్యాయమైన డిమాండ్ల నెరవేర్చడం కోసం త్వరలో 48 గంటల పాటు ధర్నా చౌక్‌ వద్ద వేలాదిమంది అయ్యప్ప స్వాములతో మహా ధర్నా ను నిర్వహించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నామని వారు తెలిపారు,ఈ సమావేశంలోఆలయ ధర్మకర్తలు విఎస్‌ గణేష్‌ గురుస్వామి, పొట్టేలు సదానందం, బండారి విజయ్‌ కుమార్‌,డి యశ్వంత్‌, మధు కుమార్‌, గోవర్ధన్‌ గురుస్వామి కృష్ణ గురుస్వామి లతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అయ్యప్ప గురు స్వాములు పాల్గొన్నారు ,

Leave A Reply

Your email address will not be published.

Breaking