ఉదయం 9గంటలకు ముహూర్తం
ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 13 (ప్రజాబలం) ఖమ్మం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో తనకు కేటాయించిన కొత్త చాంబర్ లోకి గురువారం ప్రవేశం చేయనున్నారు. అనంతరం ఆయా శాఖల మంత్రి గా బాధ్యతలు స్వీకరిస్తారు. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ (రూమ్ నంబర్ 10, 11, 12)లో ఉదయం 9గంటలకు ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు వచ్చి కలవొచ్చని మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.