ఖమ్మం ప్రతినిధి జూన్ 21 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించనున్నారు ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా నేలకొండలపల్లి మండలంలోని మోటపురం, శంకరగిరి తండా, రాజేశ్వరపురం, అమ్మగూడెం, కోరట్లగూడెం, కోనాయిగూడెం, అరెగూడెం, ఆచార్లగూడెం, బోదులబండ, మండ్రాజుపల్లి గ్రామాలను, తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు, హస్నాబాద్, లక్ష్మిదేవిపల్లి, సుబ్లేడు, మేడిదపల్లి గ్రామాలను సందర్శిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తారని తెలిపారు. అదేవిధంగా రాజేశ్వరపురంలో నేలకొండపల్లి మండల లబ్దిదారులకు, బచ్చోడులో తిరుమలాయపాలెం మండల లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను కూడా పంపిణీ చేస్తారని తెలిపారు. కావున నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై పొంగులేటి పర్యటనను విజయవంతం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు