ఖమ్మం ప్రతినిధి జూన్ 21 (ప్రజాబలం) ఖమ్మం
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం అంతర్జాతీయ యోగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారులు యోగాసనాలు,సూర్య నమస్కారాలు అందరినీ ఆకట్టుకున్నాయి .ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణచైతన్య మాట్లాడుతూ ప్రపంచానికి మన భారత దేశం యోగాను వర ప్రసాదంగా అందించింది అన్నారు. శారీరకంగా,మానసికంగా ఒత్తిడి తగ్గించడానికి యోగ ఉపయోగపడుతుందని తెలియచేసారు. పతంజలి మహర్షి ద్వారా వేల సమత్సరాలుగా మన దేశంలో యోగా ఆసనాలు, ధ్యానం ప్రాణాయామం వీటిద్వారా మనకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతున్నదని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య ఉపాధ్యాయులు విద్యార్ధులు పాల్గొన్నారు