రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు ఎరువులకి బిల్లులు ఇవ్వాలి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ఖమ్మం ప్రతినిధి జూన్ 21 (ప్రజాబలం) ఖమ్మం విత్తన విక్రయ షాపుదారులు, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించి, బిల్లులు ఇవ్వాలని, అట్టి బిల్లులు, ఖాళీ ప్యాకులు పంట సీజన్ పూర్తయే వరకు భద్రపర్చుకొనేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, స్థానిక బర్మాషెల్ రోడ్, గాంధీ చౌక్ లోను లక్ష్మి వెంకటరమణ సీడ్స్, ఉషశ్రీ మార్కెటింగ్ ఏజెన్సీ, లక్ష్మి మణికంఠ ఏజెన్సీ విత్తన, ఎరువుల విక్రయ షాపుల ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా షాపులలో ఉన్న విత్తనాలు, నిల్వ వివరాల బోర్డును పరిశీలించారు. షాపులలో స్టాక్ రిజిస్టర్, ఇన్వాయిస్ బుక్, బిల్ బుక్ లను, విత్తన బస్తాలపై లాట్ నంబర్, ఎం.ఆర్.పీ. రేటు, బ్యాచ్ నెంబర్, గడువు తేదీ తదితర వివరాలను పరిశీలించారు. ఎరువులు, విత్తన అమ్మకాలకు తగిన అనుమతులు పొందిన పత్రాలను పరిశీలించి, దుకాణదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు ఏ ఏ ప్రాంతాల నుండి వస్తున్నది, ఏ ఏ రకాలు అడుగుతుంది అడిగి తెలుసుకున్నారు. ఇతర షాపులకు అమ్మినది, రైతులకు నేరుగా అమ్మినది రిజిషర్లు విడి విడిగా నిర్వహించాలన్నారు. జిల్లాలో ఏ ఏ కూరగాయలు పండిస్తారు, పూల సాగు చేస్తున్నది, ఏ విత్తనాలు ఎక్కువగా రైతులు అడుగుతుంది, మార్కెటింగ్ ఎక్కడ చేసేది అడిగి తెలుసుకున్నారు. రైతుల ఎక్స్ పొజివ్ సందర్శనలు చేపట్టాలని, సాగులో సక్సెస్ అయిన రైతు అనుభవాలను, ఇతర రైతులకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. గ్రామాల్లో నేరుగా విత్తనాల విక్రయం జరుగుతున్నాదా, రైతులు ఏదైనా దృష్టికి తెస్తే, వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. షాపుల వద్ద విత్తన కొనుగోలుకు వచ్చిన రైతులతో కలెక్టర్ మాట్లాడారు. ఎక్కడి నుండి వచ్చింది, ఏ పంట సాగు చేస్తున్నది, గత సీజన్ లో ఏ పంట సాగు చేసింది, ఏ రకం విత్తనాలు కొంటున్నది, షాపు వారు ఎం.ఆర్.పి. రేటుపై ఇస్తున్నారా, అదనంగా అడుగుతున్నారా అడిగి తెలుసుకున్నారు. సాగులో ట్రాన్స్ ప్లాంట్, బ్రాడ్ కాస్ట్, డ్రమ్ సీడ్ పద్ధతుల్లో ఏ పద్ధతికి ఎంత పెట్టుబడి, దిగుబడి వివరాలు సమర్పించాలని, ఏ పద్ధతి లాభదాయకంగా ఉంటుందో, ఆ పద్దతిలో సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ అన్నారు. వ్యవసాయ అధికారుల తనిఖీల షెడ్యూల్ ప్రకారం, షాపుల తనిఖీలు పకడ్బందీగా చేయాలని ఆయన తెలిపారు. జిల్లాలో విత్తనాలు ఎలాంటి కొరత లేదని, అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. రైతులు ప్యాక్ చేసిన విత్తనాలు మాత్రమే కొనాలని, లూజ్ విత్తనాలు, సీల్ తీసిన విత్తనాలు కొనవద్దని ఆయన అన్నారు. విత్తనాలు కొనే ముందు రైతులు హాలోగ్రామ్ చూసి కొనాలని ఆయన తెలిపారు. వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలోను, రైతు వేదికల వద్ద రైతులకు అవగాహన కార్యక్రమాలు విస్తృత పరచాలన్నారు ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారిణి విజయనిర్మల, సహాయ సంచాలకులు ఏ. శ్రీనివాసరావు, ఖమ్మం అర్బన్ మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు, అధికారులు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking