ఖమ్మం ప్రతినిధి మార్చి 15 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నియోజకవర్గంలో శనివారం పర్యటించనున్నారు ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9:30గంటలకు కూసుమంచి లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారన్నారు. ఉదయం 10గంటలకు జీళ్లచెర్వులో సీసీ రోడ్లను ప్రారంభిస్తారని తెలిపారు. ఉదయం 11గంటలకు నేలకొండపల్లి మండలం చెన్నారంలో ఆర్అండ్ బీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి అక్కడే కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటలకు చెర్వుమాదారంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఒంటిగంటకు కైకొండాయిగూడెంలో సీసీరోడ్లకు…