గూడెంలో మద్యం ప్రవాహం పై జోరుగా చర్చ
ఆగ్రహం చేస్తున్న పలు రాజకీయ పార్టీ నేతలు
జాడ లేని “ఆ” శాఖ!
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి మార్చి 15 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు
బాదుడుతో మద్యం ఏరులై పారుతున్న చర్యలు తీసుకునే వారు కనిపించడం లేదు. గూడెం వ్యాప్తంగా పెద్ద ఎత్తున మందుబాబుల జేబులకు చిల్లులు పడే విధంగా అదనపు బాదుడును పెంచుతూ మద్యాన్ని వ్యాపారంగా మలుచుకొని కోట్లకు పడగెత్తుతున్న వ్యాపారస్తుల పై ఉక్కు పాదం మోపి అధికారులు ఎక్కడా కానరాకపోవడం శోచనీయం. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుగుణంగా ధరల పట్టికలు ఎక్కడ దర్శనం ఇవ్వకపోవడం, పలు రాజకీయ పార్టీ నాయకులు గూడెం వ్యాప్తంగా మద్యం దందాను అరికట్టాలని పలు సోషల్ మీడియా వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ అధికారులు ఉలుకు పలుకు లేకుండా వ్యవహరిస్తున్న తీరు పలు విమర్శలకు తావిస్తోంది. అసలైన సిసలైన బ్రాండ్లన్నీ బెల్టు షాపులకు తరలిస్తూ అదనపు వసూళ్లతో జేబులు నింపుకుంటున్న మద్యం సిండికేట్ వ్యవస్థ పై ఉక్కు పాదం మోపి అధికారులు నిజాయితీతో పనిచేసే అధికారులు కొత్తగూడెంలో కనిపించకపోవడం విడ్డూరమంటూ గూడెంవ్యాప్తంగా జోరుగా చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ అన్న నాయకత్వంలో బెల్ట్ షాపులను నియంత్రిస్తామన్న వ్యాఖ్యలు మాటలకే పరిమితమవుతున్నాయా అధికారుల తీరుతో అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారా అక్కడ అడపాదడపాక వచ్చి దాడులు చేసి కొన్ని షాపులనే సీజ్ చేయడం ఏంటి అంటూ పలువురు స్థానికులు ప్రశ్నిస్తున్నారు.అన్ని షాపుల్లోనూ ఇదే దందా నడుస్తుంది కదా వాటన్నిటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు .ఒక ఒక్క షాపు నే సీజ్ సీట్ చేయటం ఏంటి అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరుగా మద్యం దందా ఏరులై పారుతూ మూడు పువ్వులు 10 సీసాల అన్నట్టు సాగుతున్న కొత్తగూడెం మద్యం దందాపై మరింత ఉక్కు పాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే.. ప్రజలు మద్యం కొనలేని పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు పడుతూ కుటుంబాలను రోడ్డుకు పడేవిధంగా ప్రవర్తిస్తున్నప్పటికీ మద్యానికి బానిసై అనే కుటుంబాలు బాధపడుతూ.. రోధిస్తున్న సంఘటనలు రోజువారీగా ఎన్నో చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ సంబంధిత శాఖ అధికారులు అదనపు బాదుడుతో ప్రతి సీసాపై అదనపు రేటును పెంచుతూ అసలు సిసలైన బ్రాండ్లను బెల్టు షాపులకు చేరవేస్తూ కొత్తగూడెంలో మద్యం సిండికేట్ అనుసరిస్తున్న విధానం సరైనది కాదంటూ పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు ప్రతి షాపును తనిఖీ చేసి చర్యలు చేపట్టాలని పలు రాజకీయ పార్టీ నాయకులు కోరుతున్నారు

సిండికేట్ దందాను అరికట్టేది ఎవరు గూడెం మాఫియా నీ దందా నీదే ఎక్సైజ్ శాఖ జర దేఖో ?
కొత్తగూడెంలో సిండికేట్ దందాను అరికట్టే నాధుడే కరువయ్యారు. నా దందా నాదే నా మాఫియా నాదే అన్నట్టుగా బెల్ట్ షాపులో జోరు కనిపిస్తూ మందుబాబుల జేబులోలకు చిల్లుపడే విధంగా సిండికేట్ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గూడెం లో జరుగుతున్న మద్యం దోపిడీని సిండికేట్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరుపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు షాపులపై నిఘా పెంచి నిరంతర పర్యవేక్షణ పెంచి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు