ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 15:
బీఎస్పీ వ్యవస్థాపకుడు దివంగత కాన్షీరాం జయంతి వేడుకలు నాచారం లో ఘనంగా నిర్వహించారు. బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీఎస్పీ, దళిత ప్రజా సంఘాల నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జయంతి సందర్భంగా పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ గౌడ సుదర్శన్, ఉప్పల్ నియోజకవర్గం ఇంచార్జ్ శివకృష్ణ, నాచారం డివిజన్ అధ్యక్షుడు బండారం బాబు, నాచారం డివిజన్ ఇంచార్జ్ మింద్రాల నర్సింగరావు, మహిళా కన్వీనర్ ఆసియా బేగం, పార్టీ నాయకులు అనిల్, సురేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.