ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా మార్చి 15:
వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందాని గుర్తు చేసిన మంత్రి సీతక్క :-
ఈ సందర్బంగా మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ వెనుకబడిన అదిలాబాద్ జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రములో జిల్లా గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించిన జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు సీతక్క గారు.
అభివృద్ధి పనులలో భాగంగానే కొమ్రo భీం స్టడీ సర్కిల్ ను సందర్శించిన మంత్రి సీతక్క మరియు అర్థాంతరంగా ఆగిపోయిన గుండి వాగు పనులను పరిశీలించిన సీతక్క గుండి వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను కాంట్రాక్టరును ఆదేశించిన మంత్రి వర్యులు సీతక్క.
ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేసిన పోరాట వీరుడు కొమ్రo భీం , రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసి కొమ్రo భీం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా కొమ్రo భీం స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం జొడ ఘాట్ లో కొమురం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి సీతక్క జోడే ఘాట్ ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం మరియు పోరాట యోధుడు కొమ్రం భీం మ్యూజియాన్ని సందర్శించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు, ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లా కేరి మేరీ మండలం లోని జోడే ఘాట్ లో పర్యటించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి మంత్రి వర్యులు సీతక్క గారు ఈ సందర్భంగా కొమ్రo భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జోడే ఘాట్ ప్రజలతో సమావేశమైన మంత్రి సీతక్క గారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ముఖ్యంగా ఈ ప్రాంతములో పొడుభుముల సమస్య సాగు త్రాగు నీటి సమస్య అలాగే ఇండ్ల సమస్యలు మంత్రి దృష్టికి తీసుకు రాగ వెంటనే స్పందించిన మంత్రి సీతక్క గారు మారుమూల గ్రామాల లో ఉండడానికి ఇండ్లు లేక త్రాగటానికి నీళ్ళు లేక భూములకు పట్టాలు లేక పండించడానికి సాగు నీరు లేక అనేక సమస్యలు పడుతున్న ఈ అదిలాబాద్ జిల్లా ను రాష్ట్రంలోనే అగ్రగామిగా అభివృద్ధికి బాటలు వేసుకుందాం అని గత 10 యేండ్ల కెసిఆర్ పాలనలో అదిలాబాద్ చీకటిలో నెట్టివెయ్యబడిందని ఈనాడు ఉన్న మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదిలాబాద్ జిల్లా పై ఉన్న ప్రేమ మక్కువ తో అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యడం జరిగిందని కచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు అన్నారు.

అదే విధంగా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రములో నూతన గ్రంధాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం గుండి వాగు పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి గారు ఈ వర్ష కాలం లోపు బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లో మీకు పెండింగ్ ఉన్న బిల్లు లు త్వరగా చెల్లిస్తామని ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగు పడుతుంది కావున జిల్లా అధికారులు సంభందిత కాంట్రాక్టర్ పనులు వేగవంతం ఆదేశించారు

ఈ కార్యక్రమంలో ఖాన పూర్ ఎమ్మెల్యే వేడ్మ బోజ్జు జిల్లా కలెక్టర్,అడిషనల్ కలెక్టర్, ఎస్పీ గారితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్,జిల్లా అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు