హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:వంజరి కుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని శుక్రవారంనాడు తెలంగాణ వంజరి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కాలేరు నరేందర్ , ప్రధాన కార్యదర్శి కందారి వెంకటేశం కోశాధికారి కాలేరు అమరేందర్ సెక్రట్రేట్‌లో, బీ సి ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఐఎఎస్ కి , మరియు బీ సి శాఖామాత్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కార్యదర్శి కి వంజ రి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగినది. మంత్రి శుక్రవారం కరీంనగర్‌లో ఉన్నారని వచ్చేవారం మనకు సమయం కేటాయించారని వారు ఈ సందర్భముగా చెప్పారు .
