డిప్యూటీ సీఎం భట్టి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లితో కలిసి బౌద్ధ స్థూపం పరిశీలన
పాలేరు నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 11 (ప్రజాబలం) తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పాలేరు నియోజకవర్గంలో సోమవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 8గంటలకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యాటక, ఎక్సైజ్ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి నేలకొండపల్లి మండలంలోని బౌద్ధ స్థూపాన్ని, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. అనంతరం మంత్రి పొంగులేటి ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడు, ఆరెకోడు తండాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అలాగే తల్లంపాడు నుంచి పైనంపల్లి వరకు ఉన్న ఆర్ అండ్ బీ రోడ్డు విస్తరణ పనులకు తల్లంపాడు వద్ద శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఉదయం 11.30గంటలకు టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఖరీఫ్ సీజన్ పంటల సాగుపై అదనపు కలెక్టర్, వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై జిల్లా పరిషత్ సీఈవో, డీపీవో, డీ ఎల్ పీవో, ఇతర అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని దయాకర్ రెడ్డి కోరారు