ఖమ్మం పార్లమెంటు ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్ధి మహ్మద్ రసూల్
ఖమ్మం ప్రతినిధి (ప్రజాబలం)ఖమ్మం జిల్లా రఘునాథపాలెం గ్రామపంచాయతీ మరియు జింకల తండా గ్రామ పంచాయతీలో గల గ్రీన్ కాలనీ సుమారుగా 150 కుటుంబాలు జీవిస్తున్నారు వీళ్ళకి కుటుంబాలకి ఒకటే నీళ్ల బోరు ఉన్నది. ఇక్కడ సుమారుగా 400 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి కనీసం చదవడానికి రోడ్డు సౌకర్యం కూడా లేదు. గత 15 సంవత్సరాలుగా అక్కడ నివసిస్తున్న ప్రజలకు సొంత ఇండ్ల స్థలాలు ఉన్నప్పటికీ ఉండేందుకు ఇల్లు కూడా లేని పరిస్థితి ఉందని ఇక్కడ నివసిస్తున్న పక్కా ఇల్లు లేవు. ఉన్న కుటుంబాలన్నీ తాత్కాలికంగా రేకులతో నిర్మించుకున్నారు. వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి జింకలతండా ప్రాంతానికి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఖమ్మం పార్లమెంట్ కాంటెస్టేడ్ అభ్యర్థి మహ్మద్ రసూల్ ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో తీవ్రమైన బుర్ర వరద నీరు ఉన్నతంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జింకలతండా గ్రీన్ కాలనీలో మంత్రి తుమ్మల నాగేశ్వరావు చొరవ తీసుకొని సమన్యను’ పరిష్కరించాలని బహుజన ముక్తి పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు మట్టి ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కరిస్ట్ సిహెచ్ వెంకటేశ్వర్లు ఇబ్రహీం మస్తాన్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు