ఖమ్మం ప్రతినిధి జనవరి 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బుధవారం పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా తొలుత ఉదయం పది గంటలకు కూసుమంచిలోని పాలేరు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో కూసుమంచి, నేలకొండపల్లి మండలాలకు చెందిన కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పలు బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదారుస్తారని తెలిపారు. అనంతరం కూసుమంచి మండలంలోని బురేన్ గుట్ట తండా టూ గోరిలపాడు తండా వరకు, రాజుపేట, పెరికసింగారం, ఆర్ అండ్ బీ రోడ్డు టూ గోరిలపాడు తండా వరకు నిర్మించనున్న బీటీ రోడ్లకు శంఖుస్థాపన చేస్తారన్నారు. అదేవిధంగా కూసుమంచిలో హెూమియోపతి వైద్యశాల భవన నిర్మాణానికి శంఖుస్థాపన, లింగారం తండా జీపీ బిల్డింగ్ శంఖుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పొంగులేటి అందుబాటులో ఉంటారని దయాకర్ రెడ్డి తెలిపారు