జిల్లాలో సివిల్ సప్లై కి సంబందించిన బియ్యం ఎగవేత దారులైన మిల్లర్లపై, MLS పాయింట్ ఇంచార్జ్ లపైన పెట్టిన RR ఆక్ట్ కు సంబందించిన చర్యలు సత్వరమే తీసుకోవాలి–జిల్లా కలెక్టర్ రాజర్షి షా

29-01-2024 మెదక్ జిల్లాసోమవారం కలెక్టర్ చాంబర్ లో రెవిన్యూ సివిల్ సప్లై అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా లక్ష్మి నర్సింహా రైస్ మిల్, నర్సాపూర్ శ్రీధర్ గుప్తా రైస్ మిల్, మైసాయిపేట చైతన్య ఆగ్రో, పాపన్నపేట భవాని రైస్ మిల్, రామాయంపేట భవాని రైస్ మిల్లర్లు , CMR లు ఇవ్వకుండా బకాయిలు పడ్డ వారిపై RR ఆక్ట్ ప్రకరాం సత్వరమే చర్యలు తీసుకోవాలని , స్థిర చర ఆస్తుల వివరాలు సేకరించి వారి ఆస్తుల జప్తుకు, MLS పాయింట్ గోదాములలో బియ్యం అవకతవకలకు పాలు పడిన సిబ్బంది పై RR ఆక్ట్ ప్రకారం తాకీదు సిద్ధం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు , డి యం సివిల్ సప్లైయి హరికృష్ణ , డి సి ఎస్ ఓ బ్రహ్మరావు , ఆర్ డి ఓ లు శ్రీనివాస్ , జయచంద్ర , అంబదాస్ రాజేశ్వర్ ,,తహసీల్దార్లు , సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking