సమయ స్పూర్తితో ముందుకు సాగాలి,అన్ని రంగాలలో రాణించాలి: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర.
మెదక్ ప్రాజబలం న్యూస్:-
ఏడుపాయల వనదుర్గా భవానీ మాత పాదాల చెంత బాధ్యతలు చేపట్టిన మున్నూరుకాపు సంఘం ఎల్బీనగర్ కార్యవర్గం
సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ కన్వీనర్ సర్థార్ పురుషోత్తం ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం
ముఖ్య అతిథులుగా ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ మేయర్ రాంమోహన్, సంఘం ప్రముఖులు కనకయ్య , అనిల్, జగపతి, రజిత్, నాగేందర్, ప్రవీణ్, రామారావు హాజరు
వనదుర్గా భవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులు
పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది శ్రీనివాస్, పూజారులు
సంఘటితమే బలం అని, మనమందరం మరింత ఐకమత్యంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మున్నూరుకాపు సంక్షేమ సంఘం దిల్ సుఖ్ నగర్-ఎల్బీనగర్ నూతన కార్యవర్గం ఆదివారం ప్రమాణస్వీకారం చేసింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత పాదాల చెంత సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుట్టం పురుషోత్తం రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రాంమోహన్, ప్రముఖులు బట్టి జగపతి, రౌతు కనకయ్య,గాలి అనిల్ కుమార్,ఆకుల రజిత్, ఊసా రఘు,తూడి ప్రవీణ్, నాగేందర్, కల్లూరి హనుమంత్ రావు,ఆవుల రామారావులు దేమా యాదగిరి, శివ్వం పేట ఎంపీపీ కల్లూరి హరి కృష్ణ, నార్సింగ్ ఎంపీపీ సబితా ముఖ్య అతిథులుగా హాజరు.. కాగా సంఘం అధ్యక్షులు ఆనంతుల నవీన్, ప్రధాన కార్యదర్శి చక్రం నాగరాజు కోశాధికారి అక్కెన పల్లి వేణు గోపాల్ ప్రమాణ స్వే్రకారం చేశారు .ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, అందరితో స్నేహసంబంధాలు పెంచుకుంటూ సమయస్పూర్తితో అన్ని రంగాలలో ఉన్నతంగా ఎదిగేందుకు తమ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రమాణస్వీకారం చేసిన వారిలో సంఘం అధ్యక్షులు అనంతుల నవీన్, ప్రధాన కార్యదర్శి చక్రం నాగరాజు, కోశాధికారి అక్కినేపల్లి వేణుగోపాల్, సంయుక్త కార్యదర్శి మామిడి అశోక్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రతో పాటు ముఖ్య అతిథులుగా హాజరైన వారంతా నూతన కార్యవర్గానికి శుభాభినందనలు తెలిపారు. అంతకుముందు ఎంపీ వద్దిరాజు, మాజీ ఎమ్మెల్సీ పూల,మాజీ మేయర్ బొంతు తదితర ప్రముఖులు వనదుర్గా భవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ సిబ్బంది శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి గోత్రనామాలతో పూజలు చేసి ఆశీర్వచనాలు పలికారు.పూలదండలు, శాలువాలతో వారిని సత్కరించి మాత తీర్థప్రసాదాలు అందజేశారు. అలాగే, ఎంపీ రవిచంద్రతో పాటు సంఘం ప్రముఖులు దేమే యాదగిరి,దుర్గం రవీందర్,మాలి కరుణాకర్,డీఎల్ఎన్ పటేల్,కల్లూరి హనుమంతరావు,రాధాకిషన్, అనంతుల శ్రీనివాస్,చల్లా నరేంద్ర,కోట్ల వినోద్,పోరెడ్డి మల్లేశం,చల్లా ఆనంద్ కుమార్ తదితరులు దుర్గాభవానీ మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రమాణస్వీకారం సందర్భంగా “జై మున్నూరుకాపు జైజై మున్నూరుకాపు”,”వర్థిల్లాలి వర్థిల్లాలి మున్నూరుకాపుల ఐక్యత వర్థిల్లాలి”అనే నినాదాలు హోరెత్తాయి.