ఆరేళ్ల కల సాకారమైన వేళ…!

 

మంత్రి పొంగులేటి చొరవతో అప్పలనర్సింహాపురానికి బస్సు సర్వీస్

గ్రామ నాయకుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడిన క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ దయాకర్ రెడ్డి

హర్షం వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు

ఖమ్మం ప్రతినిధి జనవరి 29 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి అప్పలనర్సింహాపురం గ్రామస్తుల ఆరేళ్ల కల మంత్రి పొంగులేటి చొరవతో సాకారమైంది గత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు తమ గ్రామానికి బస్సు సర్వీస్ ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని చెబుతూ ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి దృష్టికి ఆదివారం తీసుకువెళ్ళారు. వెంటనే ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. గ్రామస్తుల కోరిక మేరకు బస్సు సర్వీస్ ఏర్పాటు చేయాలని కోరారు. స్పందించిన అధికారులు బస్సు సర్వీస్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ఉదయాన్నే ఆ గ్రామానికి బస్సు రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో ఎనికె జానకి రామయ్య, మన్నే నగేష్, శీలం పెద్ద వెంకటేశ్వర్లు, పుసులూరి విశ్వనాథం, పెంటమాల అశోక్, వెంపటి స్వామి, అయినాల భాస్కరరావు తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking