కరీంనగర్ ప్రజాబలం ప్రతినిధి మంకమ్మతోటలో పొన్నం కాంప్లెక్స్ వద్ద నూతనంగా నిర్మించిన మినిస్టర్ క్యాప్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. క్యాంప్ కార్యాలయంలో కుటుంబ సభ్యుల తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అందుబాటులో ఉండడానికి క్యాంప్ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. అన్ని రకాల అర్జీలు, విజ్ఞాపన పత్రాలు, సీఎం రిలీఫ్ ఫండ్, ఆస్పత్రికి సంబంధించిన సహాయాలు, విద్యార్థులు, మహిళలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ప్రజాపాలన ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ శాసనసభలు చేసిన చట్టాన్ని గవర్నర్ నుండి రాష్ట్రపతికి పంపించాం. బిల్లు ఆమోదంపై కాంగ్రెస్ బీసీ నేతలు , అన్ని రాజకీయ పార్టీల నేతలు కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి ఢల్లీి వెళ్తున్నాం.బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించుకుంటామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పార్టీలకతీతంగా ఎలా ఉద్యమం చేశామో..ఇప్పుడు కూడా ప్రభుత్వం తీసుకున్న గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని సాధించడానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి. 5, 6, 7 తేదీల్లో ఢల్లీిలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలి. కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న బిజెపి మంత్రులు బీసీ ప్రజాప్రతినిధులు సానుకూలంగా కార్యాచరణ తీసుకోవాలి. ప్రభుత్వ ప్రతిపాదనను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.
Prev Post