సింగూరు ప్రాజెక్టుకు జలకళ

 

👉 నాడు వెలవెల నేడు కలకల

👉 వానాకాలం సాగుకు భరోసా

👉 త్రాగునీటికి కొరత లేదు

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి ఆగస్టు 04 (ప్రజాబలం )సంగారెడ్డి జిల్లా : ఉమ్మడి మెదక్ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయినా సింగూరు ప్రాజెక్టు, ప్రస్తుతం నిండుకుండలా నీటితో కళకళలాడుతుంది, సింగూరు ప్రాజెక్టుపై రైతులు పెట్టుకున్న ఆశలకు జీవం పోసినట్లు, ప్రాజెక్టుకు మళ్ళీ జలకళ సంతరించుకుంది, గత నాలుగు రోజుల నుండి కురిసిన భారీ వర్షాలకు, ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది, ప్రస్తుతం ఇన్ ప్లో 2484, క్యూసెక్కులు నీరు కాగా, ఔట్ ఫ్లో 633, క్యూసెక్కులుగా కొనసాగుతుంది, ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం29.917, కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిలువ 20.626, టీఎంసీల వరకు నీటి నిలువ ఉంది.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం, సింగూర్ వద్ద,ఈ సింగూర్ ప్రాజెక్టు 29.917, టీఎంసీల నిటి సామర్థ్యంతో నిర్మించిన, ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 2, టీఎంసీల వరుద నీరు వచ్చి చేరగా, వరద ప్రవాహం గతంలో కంటే తగ్గినప్పటికీ, మరో రెండు టీఎంసీల వరకు నీరు వచ్చి చేరే అవకాశం ఉందని, అధికారులు అంచనా వేస్తున్నారు, ప్రస్తుతం ప్రాజెక్టులో 20.626, టీఎంసీల నీటి నిలువ ఉండగా, కొనసాగుతున్న వరదతో 21, టిఎంసిల వరకు నీరు చేరుకునే అవకాశం కనిపిస్తుంది, గతంలో సింగూరు ప్రాజెక్టులో నీటి కొరత కారణంగా, త్రాగునీటి అవసరాలు తీర్చుకోలేక, గతంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, సింగూరు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917. టీఎంసీలు కాగా, అయితే ప్రాజెక్టులో, 16,టీఎంసీలు దాటితేనే, సాగుకు దిగువ ప్రాంతాలకు నీటిని వదలాల్సి ఉంది, సింగూరు ప్రాజెక్టు నుంచి ప్రతి ఏడాదికి, వనదుర్గా (ఘనపూర్ ) ప్రాజెక్టుకు 4.06, టీఎంసీలు, నిజాంసాగర్ కు,8.35, టీఎంసీలు,2, టీఎంసీలు, అందోల్,పుల్కల్, మునిపల్లి, సదాశివపేట, మండలాల పరిధిలోని,150,చెరువులు, 48,ఎకరాల సాగుకు రెండు పర్యాయాలు, నీటిని వదలాలన్నా నిబంధన ఉంది,16,టీఎంసీల లోపు ప్రాజెక్టులో నీటి నిల్వ ఉన్నట్లయితే, త్రాగు నీటికి మాత్రమే వాడాలని ప్రభుత్వం ఖచ్చితమైన నిబంధన ఉండడంతో, ప్రస్తుతం త్రాగునీటికి డోకా ఉండదనె చెప్పవచ్చు, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు , ఇలాగే కొనసాగితే మరో నెల రోజుల్లో, పూర్తిస్థాయిలో ప్రాజెక్టులోకి, మరింత వరదలు వచ్చే అవకాశం కనిపిస్తుందని ప్రాజెక్ట్ అధికారులు, తెలియజేశారు…

Leave A Reply

Your email address will not be published.

Breaking