మంత్రి పొన్నం కు దళిత ముందు సాధన సమితి వినతి

 

జమ్మికుంట, ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 25

దళితబందు సాధన సమితి హుజురాబాద్, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయంలో తొలిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దళితబందు పై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నాడని తెలిసి దళితబందు సాధన సమితి హుజురాబాద్, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సచివాలయానికి వెళ్ళారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలసి ఈ సమీక్షా సమావేశంలో దళితబందు మంజూరు పై మాట్లాడాలని కోరారు. మంత్రి సానుకూలకంగా స్పందించి తప్పకుండ దళితబందు గురించి సమావేశంలో మాట్లాడుతానని చెప్పారు. ఖమ్మంలో మధిర నియోజకవర్గం చింతకాని మండలంలో ఈ నెల 16 నా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క 15కోట్ల 62 లక్షల 32వేయిల 620 గల దళితబందు రెండవ విడత చెక్కులు పంపిణి చేసారు. అదేవిదంగా పైలెట్ ప్రాజెక్టు గా మొదలు పెట్టిన హుజురాబాద్ లో కూడా పూర్తిస్థాయిలో మంజురు చేసి దళితుల అభ్యున్నతికి దోహదపడాలని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళితబందు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కొగిలా మహేష్, హుజురాబాద్ సాధన సమితి సభ్యులు కోలుగూరి సురేష్, కోలుగూరి నరేష్, ఇనుగాల బిక్షపతి, అంబాల కుమార్,ఎల్కపెల్లి ఉదయ్ కుమార్,పాత రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking