తాతా నిఖిల్ కు నివాళులు అర్పించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 22 (ప్రజాబలం)ఖమ్మం ఇటీవల బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అద్యక్షుడు మరియు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు తాతా విశ్వేశ్వరరావు, నాగమణి దంపతుల కుమారుడు తాతా నిఖిల్ మృతి చెందారు.

ఈ మేరకు తిరుమలయిపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలోని వారి నివాసంకు వెళ్లి వారి కుటుంబాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

అనంతరం నిఖిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

కార్యక్రమంలో మంత్రి వెంట సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ నాగండ్ల కొటి, పైడిపల్లి సత్యనారాయణ ,ముత్యాల వెంకటప్పారావు, తాతా వెంకట కృష్ణయ్య, తాతా రవీందర్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking