ఉచిత ఆర్తోపెడిక్స్ వైద్య శిబిరం

వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 22:
ఉచిత ఆర్థోపెటిక్ వైద్య శిబిరం ట్రామా మరియు రోబోటిక్ మోకీలు, తోంటి మార్పిడి శస్త్ర చికిత్స నిపుణుడు డాక్టర్ కొమురవెల్లి రాకేష్ అధ్వర్యంలో వరంగల్ జిల్లా రామన్నపేట లోని ఆర్యవైశ్య సత్రంలో ఆదివారం ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరన్నీ శ్రీకర హాస్పిటల్స్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఉదయం 10 నుండి 5 గంటల వరకు నిర్వహించారు. ఉచిత ఆర్థోపెడిక్ వైద్య శిబిరానికి సుమారుగా 200 పైచిలుకు రోగులు విచ్చేసి ఎముకలకు సంబంధించిన వైద్య సేవలను ఉచితంగా పొందారు. అవసరం ఉన్నవారికి బోన్ మినరల్ డెన్సిటీ (బిఎండి) పరీక్షలు ఉచితంగా చేసి తగు సూచనలు చేయడం తో పాటు ఔషధాలను అంద చేశారు. ఈ కార్యక్రమంలో కొమరవెల్లి రామచందర్, ఆర్యవైశ్య సత్రం అధ్యక్షులు గోరంటల యాదగిరి, గౌరవ సభ్యులు బ్రహ్మదేవర సోమలింగం, శ్రీకర ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking