ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం) ఖమ్మం కార్పొరేషన్ లో గల వైరా రోడ్డులో పాత ఎల్ఐసీ కార్యాలయం ఎదురుగా నూతనంగా ఎర్పాటు చేసిన శ్రీ బాలాజీ బందర్ మిఠాయి దుకాణంను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇలాంటి దుకాణం ఖమ్మానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రజలకు అందుబాటులో రేట్ల మరియు మంచి క్వాలిటీ అందించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనకొల్లు నీరజ సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ నగర బిఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు దుకాణం ప్రోప్రైటర్ రాజ్ కుమార్ మరియు బంధువులు తదితరులు పాల్గొన్నారు