ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 21 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి స్కూల్ స్వీపర్ల రిలే నిరాహార దీక్ష 57వ రోజు చేరింది ఈ కార్యక్రమంలో స్వీపర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఇమామ్ ఖాదర్ మాట్లాడుతూ స్కూల్ సీపర్లను ప్రభుత్వం పట్టించుకోవాలని 27 వేల రూపాయల వేతనం ఇవ్వాలని తొలగించిన స్వీపర్లను విధులు చేర్చుకోవాలని చనిపోయిన స్వీపర్లకు వారసులకు ఉద్యోగం ఇవ్వాలని స్వీపర్లు 15 లక్షలు ఇన్సూరెన్స్ కల్పించాలని పార్ట్ టైం స్వీపలను ఫుల్ టైం గా గుర్తించాలన్నారు స్వీపర్లు చనిపోయిన రోజు దాన ఖర్చులకు 50 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు బాల్య సుక్య రాములు బాలయ్య అంజయ్య పుల్లయ్య బాబు తదితరులు పాల్గొన్నారు