ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లా ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలి మంత్రి తుమ్మల
ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి21 (ప్రజాబలం) ఖమ్మం
నగరం నడిబోడ్డున ఎళ్ళా చిరిత్ర కలిగిన ఖమ్మం ఖిల్లాను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు డిపిఆర్ రూపొందించి నివేదిక సమర్పించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహాకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆర్కియాలజీ, పర్యాటక శాఖ అధికారులతో ఖమ్మం ఫోర్టు అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యాటకులను ఆకర్షించే విధంగా నిపుణులైన కన్సల్టెంట్లతో మౌళిక సదుపాయాలు ఖమ్మం ఖిల్లాలో రోప్‌వే, త్రాగునీరు, టాయిలెట్స్, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, మెట్ల రైలింగ్, లైటింగ్, గజిబోస్, సీటింగ్ బేంచీలు, విద్యుత్ సరఫరా కోట ప్రాంత పరిరక్షణతో కూడిన ఇతర పర్యాటక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి అన్నారు ఆర్కెయాలజీ అండ్ మ్యూజియం శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఇంజీనర్లు రామకృష్ణ, శ్రీదర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.
