రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఈవియం కమీషనింగ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి

జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌ కె.శ్రీరామ్‌ మదన్‌ గోపాల్‌లు

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి21 (ప్రజాబలం) ఖమ్మం
రానున్న పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఈవియం కమీషనింగ్‌పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌ కె.శ్రీరామ్‌, మదన్‌ గోపాల్‌లు తెలిపారు. బుధవారం నూతన కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌, పి.ఓ, ఏపిఓలకు బ్యాలెట్‌ యూనిట్‌, వి.వి.ప్యాట్‌, కంట్రోల్‌ యూనిట్‌ల అమరిక, పనీతీరు, మాక్‌పోల్‌, పోలింగ్‌ సమయంలో వచ్చే సమస్యలపై అవగాహన కల్పించారు. పోలింగ్‌ రోజు పోలింగ్‌, మాక్‌పోలింగ్‌ సమయంలో నిర్వర్తించవలసిన విధులు నింపవలసిన పత్రాలపై వివరించారు ఈ సందర్భంగా మాస్టర్‌ ట్రైనర్లు శిక్షణకు సంబంధించి అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు ఇంచార్జ్‌ జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల, మాస్టర్‌ ట్రానర్స్‌, పి.ఓలు, ఏపిఓలు తదితరుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking