ఎంపీ ల్యాండ్స్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులలో అసంపూర్తిగా ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్
ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 21:
బుధవారం రోజున వి.సి మీటింగ్ హాల్లో ఎంపీ లాండ్స్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో (సిడిపి , ఎంపీ, ఎస్ డి ఎఫ్, సి బి ఎఫ్) చేపట్టిన పనుల పురోగతి పై జిల్లా ప్రణాళికా అధికారి మోహన్ రావు, తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లా వ్యాప్తంగా అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని ఎక్కడ కూడా పనులు పెండింగ్ లో ఉండకుండా చూడాలని కలెక్టర్ అన్నారు . ఆయా శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనులను చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా నియోజకవర్గ అభివృద్ధి నిధులు (కాన్సిట్యూషన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ –సీడీఎఫ్) పార్లమెంట్ ప్రాంత అభివృద్ధి నిధులు (మెంబెర్ అఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ – ఎంపీ ల్యాడ్స్) క్రుషియల్ బ్యాలెన్స్డ్ ఫండ్ (సీబీఎఫ్), ప్రత్యేక అభివృద్ధి నిధులు (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ – ఎస్డీఎఫ్)కు సంబంధించి జిల్లాలోని రహదారులు భవనాలు, పంచాయతీరాజ్, అటవీ శాఖ , జిల్లా అభివృద్ధి నిధులు, డీడబ్ల్యువో, డీఆర్డీఏ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సందర్భంగా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ అధికారులు అందరూ సమన్వయంతో పని చేయాలని అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయగలరని సూచించారు. ఎం పి ల్యాండ్స్ నియోజక వర్గ అభివృద్ధి నిధులతో చేపట్టి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ నెల చివరినాటికి పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు అధికారులతో అభివృద్ధి పనులపై నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిని ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. టెండర్ ప్రక్రియలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.ఇప్పటి వరకు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టిన పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయని పెండింగ్ లో ఎన్ని ఉన్నాయని రద్దు చేసినవి ఎన్ని తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. పనులు పూర్తి చేయడం జరిగిందని, ఇంకా ఎన్ని పనులు ఏఏ స్థాయిలో పెండింగ్ లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు . పూర్తిగా క్యాన్సల్ అయినవి ఎన్ని అనే వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా అధికారులు కృషి చేయాని కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు పూర్తి చేసిన పనులకు సంబంధించిన యూటిలైజషన్ సర్టిఫికెట్ లను సిపిఓకు పంపాలని అన్నారు. తదుపరి సమావేశానికి అభివృద్ధి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.