సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ రికవరీ
జిల్లా అదనపు ఎస్.పి. అడ్మిన్ ఎస్.మహేందర్
ప్రజాబలం దినపత్రిక
మెదక్ జిల్లా నియోజకవర్గం
28.09.2024:
శనివారం మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారి ఆదేశానుసారం జిల్లా అదనపు ఎస్.పి. అడ్మిన్ ఎస్.మహేందర్ పోగొట్టుకున్న ఫోన్ ను అప్పగించడం అయినది. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్.పి. అడ్మిన్ ఎస్.మహేందర్ మాట్లాడుతూ.. మెదక్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ వర్ధిల్లి మురళి గారి యొక్క సెల్ ఫోన్ గత సంవత్సరం క్రితం బస్సులో ప్రయాణం చేస్తుండగా మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్ అయినది. ఇట్టి విషయంలో మీసేవ ద్వారా దరఖాస్తు చేయగా సదరు మొబైల్ యొక్క వివరాలు సిఈఐఆర్ (సెయిర్ ) పోర్టల్ నందు అప్లోడ్ చేయగా గత నెల రోజుల క్రితం సదరు మొబైల్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావుపల్లి గ్రామంలో ట్రేస్ అయినదని సామాచారం రాగా అట్టి మొబైల్ ఫోన్ ని ఆంధ్ర పోలీసుల సహకారంతో సదరు మొబైల్ ను జిల్లా పోలీస్ కార్యాలయం కు ఈ రోజు తెప్పించి అడిషనల్ ఎస్పీ మెదక్ గారి ద్వారా మురళి గారికి మొబైల్ అందజేయమైనది ఇట్టి సందర్భంగా తమ విద్యార్థులకు చట్టం పట్ల పోలీసు వ్యవస్థ పట్ల నమ్మకం కలిగి ఉండి క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించవలసినదిగా ప్రొఫెసర్ గారిని మరియు డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎండి హుస్సేన్ గారిని తెలియజేసినారు. ఈ ఫోన్ కనుగొనుటకు కష్టపడిన కానిస్టేబుల్ ఎస్. లక్ష్మి నారాయణ గారిని ఈ సందర్భంగా అబినందించినారు.