వీఆర్ఏ వారసులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించాలని ఆర్డీవో కి వినతి పత్రం

 

వీఆర్ఏ వారసులకు న్యాయం చేయాలి

 

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 81,85, 24-07-2023 ప్రకారం 3797 మంది 61 ఏండ్లు పైబడిన విఆర్ఎల వారసులకు త్వరితగతిన నియామక ఉత్తర్వులు ఇప్పించాలని వీఆర్ఏల సంఘం నాయకులు ఆధ్వర్యంలో ఖమ్మం ఆర్డీవో గణేష్ కి వినతిపత్రం అందించారు.గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఆర్ఎలను రెగ్యులర్ చేస్తూ కారుణ్య (వారసత్వ) నియామకాల కోసం జీవో నెంబర్ 81,85 ప్రకారం 3797 మంది వారసులకు ఉద్యోగ నియామకం కోసం జీవోలు జారిచేయబడినాయి.గత 10 నుండి 12 సంవత్సరాలుగా 61 ఏండ్లు విఆర్ఎ వారసులము ఉన్నత విద్యార్హతలు కలిగి ఉండి మా సేవలను ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మా వంతు ఎంతో కృషి చేస్తున్నాము.జీఓ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 61 సంవత్సరాలు పైబడిన విఆర్ఎ లు 265 మంది మరణించారు. అలాగే 25 మంది వారసులుకూడా మరణించారు.గత 14 నెలలుగా 20555 మంది విఆర్ఎలు చేయవలసిన విధులను 3797 మంది మాత్రమే నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గల 3797 మంది 61 సంవత్సరాలు పైబడిన విఆర్ఎ వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వనందువలన మా యొక్క కుటుంబాల ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరియు మానసికంగా కూడా ఎంతో కుంగిపోతున్నారు మా యందు మానవీయ కోణంలో దయతలచి మా 3797 మంది విఆర్ఎల వారసులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో చిర్రా నాగేశ్వరరావు ఇబ్రహీం నాగుల్ మీరా జానీ ముత్తయ్య గోపి మైబు హుస్సేన్ వీరయ్య స్వరూప మౌలాలి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking