యువకుని మృతి కి కారకుడైన ఆర్ ఎమ్ పి అరెస్ట్

 

ప్రజాబలం లక్షెట్టిపేట మండల రిపోర్టర్ సెప్టెంబర్ 28 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామానికి చెందిన బత్తుల మధుకర్ అనే యువకుడు జ్వరంతో బాధపడుతుండగా అతని తండ్రి రాజలింగయ్య హాస్పిటల్ తీసుకువెల్లుట గురించి ఆర్ ఎమ్ పి గా చలామణి అవుతున్న కన్నెపల్లి గ్రామానికి చెందిన బొడ్డు శ్రీనివాస్ ని సలహా కోరితే అతని వైద్య వృత్తి లో సరియైన అనుభవం లేకున్నా చట్ట రీత్యా మెడికల్ ప్రాక్టీషనర్ గా అతని పేరు ఎక్కడ నమోదు లేకున్నా కూడా మధుకర్ ని పరీక్షించి చూసి సరియైన వ్యాధి నిర్ధారన పరీక్షలు చేయకుండానే అతనికి తెలిసిన మూడు ఇంజక్షన్ లు రెండు గ్లూకోస్ లలో కలిపి పెట్టి ఒక ఇంజెక్షన్ తోడకి నిర్లక్ష్యంగా వైద్యం చేయడం తో గ్లూకోస్ కు ఎక్కుతుండగానే మధుకర్ కి తీవ్రమైన చలితో
వణుకుతు తలనొప్పి వచ్చి వాంతులు చేసుకోగా అతన్ని మరల పరీక్షించిన బొడ్డు శ్రీనివాస్ అతను చేసిన వైద్య వికటించినదని ఏదైనా పెద్ద ఆసుపత్రికి తేసికెళ్లామనగా వెంటనే చికిత్స కోసము మంచిర్యాలకి అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం యశోద ఆసుపత్రి కి వెళ్ళగా అక్కడ మధుకర్ బ్రైన్ డెడ్ అయిన అనంతరం చికిత్స పొందుతూ మరణించినాడని మదూకర్ తండ్రి ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసి శనివారం రోజున నిందితు డైన ఆర్ ఎమ్ పి శ్రీనివాస్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరిలించినామనీ లక్షెట్టిపేట సిఐ అల్లం నరేందర్,ఎస్సై పి సతీష్ తెలిపినారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking