నాలుగు రోజుల పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన తెలంగాణ మహిళా కమీషన్ చైర్ పర్సన్ శ్రీమతి నేరెళ్ళ శారద
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.నిర్మల్ పట్టణంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయము మరియు జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు.తరగతి గదులు,వంటశాల, టాయిలెట్స్ తోపాటు. బియ్యం, కూరగాయలు,ఇతర వంట సరుకుల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినులతో ఏకాతంగా మాట్లాడి వారికున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు.కొన్ని సబ్జెక్ట్ లకు సంబంధించి అధ్యాపకుల కొరత ఉందన్న విషయాన్ని విద్యార్థినులు మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద గారి దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాకుండా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లు విద్యార్థినులు చైర్ పర్సన్ నేరెళ్ళ శారద గారికి వివరించారు. విద్యార్థుల విన్నపాలకు సానుకూలంగా స్పందించిన చైర్ పర్సన్ శారద గారు తక్షణమే సమస్యలు పరిష్కరించాల్సిందిగా డీఈఓ ను ఆదేశించారు. మహిళలకు కమీషన్ ఏవిధంగా అండగా ఉంటుందో విద్యార్థినులకు వివరించారు. మహిళల సమస్యలపై మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లను క్లాస్ బోర్డ్ పై రాసి మహిళలందరికి తెలియజేయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు.
విద్యార్ధినికి మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద గారు ఉచిత వైద్య సాయం.
నిర్మల్ పట్టణంలో కస్తూర్భా గాంధీ విద్యాలయంలో 9 వ తరగతి చదువుతున్న విద్యార్థిని అస్వస్థతతో బాధపడటం చూసి చలించిపోయిన చైర్ పర్సన్ నేరెళ్ళ శారద గారు స్థానిక నిర్మల్ న్యూరో హాస్పటల్ డాక్టర్ నరసింహ రెడ్డికి విద్యార్థినికి వైద్యం సాయం అందించాల్సిందిగా కోరారు. ఆ విద్యార్థినికి వైద్యం పర్యవేక్షణ చూడాల్సిందిగా డీఈఓ మరియు సంబంధిత ప్రధానోపాధ్యాయురాలిని ఆదేశించారు గౌరవ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద.ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు