అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 17( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: ఆకతాయిల చేష్టలతో ప్రజలు తాగునీటి కోసం తహతహ లాడాల్సి వస్తుంది ఒకటి రెండు కాదు పైపులైను మరమ్మతులు చేసిన ప్రతిసారి పైప్ లైన్ను పగల గొట్టటం గుర్తు తెలియని దుండగులు పనిగా పెట్టుకున్నారు, ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, అల్లాదుర్గం మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామ శివారులో,161వ జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ నీటిని పైపులైన్ ద్వారా ముస్లాపూర్ కు,సరఫరా అవుతాయి గుర్తుతెలియని వ్యక్తులు ముస్లాపూర్ గ్రామంపై కోపమో ఆకతాయిలపనో తెలియదు కానీ, ప్రతిరోజు పైపులైను పగలగొట్టడం పనిగా పెట్టుకున్నారు, పైపులైను పగల గోడుతుండడంతో, గ్రామానికి మిషన్ భగీరథ నీరు సరఫరా కాక ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడాల్సి వస్తోంది, వేసవి కాలం కావడంతో గ్రామస్తులు తమగొంతులను తడార్పుకునేందుకు పడుతున్న పాట్లు చెప్పనలివిగా లేవు పైపులైను పగిలిన చోట గ్రామస్తులు మరమ్మత్తులు చేసుకుంటే, మరుసటి రోజు అదే ప్రాంతంలో పైప్ లైన్ లీకేజీ కావడం పారి పాటిగా మారిపోయింది, అనునిత్యం పైపులైను పగలగొడుతున్న దుండగులను పట్టుకొని, కఠినంగా శిక్షించాలని, గ్రామానికి నిత్యం మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలని సంబంధిత అధికారులకు గ్రామస్తులు వినతి చేస్తున్నారు…