అందులో నియోజకవర్గ ప్రతినిధి మార్చి 17 ( ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా: అందోల్ నియోజకవర్గం లోని రాయికోడు మండల పరిధిలోగల సింగీతం గ్రామంలో ఎస్సీ కాలనీలో త్రాగునీటి కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశానుసారం, ఈరోజు ఎస్సీ కాలనీలో బోర్ వేయించడం జరిగింది, గ్రామ ప్రజలు సంతోషంతో వారికి ధన్యవాదాలు తెలిపారు, ఈ కార్యక్రమంలో రాయికోడు మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభాకర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాజిత్, నాయకులురఫిక్,శంకరయ్య స్వామి, గ్రామ యువజన సంఘాల కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు