బీ.ఆర్.ఎస్ పార్టీ మణికొండ నాయకులు, ప్రజల తరపున డిమాండ్

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 17 మార్చి 2025
భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ నాయకులు గత కొంత కాలంగా గుడ్ మార్నింగ్ మణికొండ పేరున ప్రతి కాలనీకి, అపార్ట్మెంట్ ప్రజల వద్దకు వెళ్లి వారి సాధక బాధలను పర్యవేక్షిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ చేసి సేకరించిన స్థానిక ఇబ్బందుల సమాచారం సంబంధిత అధికారులకు పిర్యాదు చేస్తూన్న దరిమిలా సోమవారం రోజున మణికొండ మునిసిపల్ కమిషనర్ ను కలసి వినతి పత్రం అందజేయడం జరిగినది:
1. అంబేద్కర్ భవనం కట్టకుండా అవమాన పరుస్తున్న అధికారులు.
2. స్మశాన వాటికకు దారి వేయని మణికొండ మునిసిపాలిటీ.
3. రెడీ మిక్స్ ప్లాంట్ వల్ల చెడిన రోడ్డును కొత్తగా వేయాలనీ డిమాండ్.
4. ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ స్మశాన వాటికలు ఏర్పాటు చేయాలి.
5. చెప్పా పెట్టకుండా పెంచిన ప్రాపర్టీ టాక్స్ ను తగ్గించాలి.
6. మారుతి నగర్ రోడ్డు ఆక్రమణను అరికట్టాలి.
7. నెమలి నగర్ లో కమ్యూనిటీ హాలు కట్టాలి.
8. శానిటేషన్ సిబ్బందికి 15 రోజుల సెలవు ఇవ్వాలి.
9. వీధి కుక్కలకు షెల్టర్ హోమ్ కట్టాలి.
పెంటయ్య నగర్, వినాయక్ నగర్, సాయి గౌతమ్ నగర్, వీకర్ సెక్షన్ కాలనీ, ఎంప్లాయీస్ కాలనీలతో పాటు దాదాపు మణికొండ మొత్తంగా రోడ్డులు కడు దీనస్థితిలో చెత్తా చెదారంతో నిండి, ఎగుడు దిగుడు గుంతల మయంగా ఉన్న వాటిని బాగుచేయాలి, డ్రైనేజీ పొంగి పొర్లుతూ దుర్గందంతో పాటు దోమల నివారణ పై చర్యలు చేపట్టాలి, అన్యాక్రాంతమై మిగిలిన కొద్ది పాటి ముస్కీమ్ చెరువు అపరిశుభ్రతను తొలగించాలి, దోమల బెడద తగ్గించాలి, పై అన్ని విషయాలు పరిగణలోకి తీసుకొని స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లేనియెడల ప్రజల మద్దతుతో ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తున్నాము. ఇట్టి కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ మణికొండ అధ్యక్షుడు సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, రూపా రెడ్డి, అందే లక్ష్మణ్ రావు, ఉపేందర్నాధ్ రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, దిలీప్, రాజేంద్ర ప్రసాద్, కిరణ్ యాలాల, జై, సుమనళిని, భాను చందర్, రాఘవ రెడ్డి, బొడ్డు శ్రీధర్, కృపాకర్, సురేంద్ర తది తరులు పాల్గొన్నారు.

     

Leave A Reply

Your email address will not be published.

Breaking