జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
పైలెట్ ప్రాజెక్టు కింద
నేటి నుండి జిల్లాలోని 05 ప్రాథమిక పాఠశాలలో ఏఐ ద్వారా విద్య బోధన ప్రారంభం.
గోవిందరావు పేట మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చల్వాయి లో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్.
ప్రజాబలం జిల్లా రిపోర్టర్
తేది.17.3.2025.
ములుగు జిల్లా.
ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు.
సోమవారం గోవిందరావు పేట మండలం చల్వాయి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) తో విద్య బోధన ను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు కంప్యూటర్ లో చేస్తున్న తెలుగు, ఆంగ్లానికి సంబంధించిన ప్రమాణాలను పరిశీలించారు. గణితంలో సంఖ్యా భావనలు కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలు, తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ప్రభుత్వ పాఠశాలలో విద్య బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈరోజు జిల్లా వ్యాప్తంగా 05 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానములో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3 నుండి 5 తరగతి విద్యార్థులకు కనీస విద్య ప్రమాణాలు, అభ్యాసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు.
ఇప్పటికే ఆరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించగా అక్కడ మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పాటు ములుగు జిల్లాలో కూడా ఈరోజు నుండి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
