కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రారంభించారు

ప్రజా బలం ములుగు ప్రతినిధి
తేదీ 17 మార్చి 202
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయము -ములుగు.

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం లోని భాగంగా కంటి సెలు కంటి చూపు లోపాలను గుర్తించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులకు ,కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ప్రారంభించారు. రాష్ట్రీయ బాల సస్త్య కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కంటి చేఅద్దాలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ,,విద్యార్థులను ,ఉద్దేశించి మాట్లాడుతూ,కంటిలోపాలను కంటి అద్దాలతో పాటు, పోషకాహార మైన ఆకు కూరలు, గుడ్లు ,చేపలు పాలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ గోపాలరావు మాట్లాడుతూ జిల్లాలో మొదటి రెండు ఐస్క్రీనింగ్ కార్యక్రమాలను జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల నిర్వహించి 1427 మంది పిల్లలను గుర్తించి కంటి అద్దాల కొరకు మూడవ స్క్రీనింగ్ నిర్వహించి 1219 మంది జాబితాను ప్రభుత్వానికి అందజేశాము. ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం లోని వైద్యాధికారులు మరియు సిబ్బందితో అన్ని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కంటి అద్దాల పంపిణీ జరుపుతామని డిఎంహెచ్ఓ గోపాలరావు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్బిఎస్కే జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ రణధీర్, ములుగు ప్రధాన ఆస్పత్రి కంటి నిపుణులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి ,డెమో. సంపత్ డాక్టర్. శ్రీలత, డాక్టర్. మల్లికార్జున్ , పాఠశాలల అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్ ,ఆర్ బి ఎస్ కే సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking