ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలి.

 

 

అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు.

ప్రజాబలం ప్రతినిధి
తేది.17.3.2025.
ములుగు జిల్లా.

ప్రజా ఫిర్యాదులను పెండింగ్ ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు అధికారులకు ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి సందర్భంగా జిల్లాలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 19 పిర్యాదులు సమర్పించారని, వాటిలో ధరణి కి సంబంధించిన భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ ఉపాధి, ఆసరా పెన్షన్లు, ఇతర శాఖలకు సంబంధించిన సమస్యల పై దరఖాస్తులు సమర్పించారని తెలిపారు.

ప్రజావాణి ద్వారా వచ్చిన పిర్యాదులను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించిన పిర్యాదులను సంబంధిత అధికారులకు పంపి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking