వాసన్ ఐ కేర్ సెంటర్ వారి ఫ్రీ గ్లాకమా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ క్యాంప్ ర్యాలీని ప్రారంభించిన…నార్నె శ్రీనివాస రావు
కూకట్పల్లి (ప్రజబలం)మార్చ్ 15 :
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని పిఎన్ఆర్ ఎంపైర్ కాంప్లెక్స్ లోని వాసన్ ఐ కేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఫ్రీ గ్లాకమా స్క్రీనింగ్ ప్రోగ్రామ్ క్యాంప్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించి ర్యాలీ తీసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ గ్లకోమ అనేది చాలా ప్రమాదకరం అని, నలభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని, అలాంటి వారికోసమే వాసన్ ఐ కేర్ సంస్థ వారు గ్లకోమా పరీక్షలు అన్ని శాఖల్లో ఈ నెలాఖరు వరకు ఉచితంగా చేయించుకోటానికి అందుబాటులో ఉన్నాయి అని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని చెప్పడం జరిగింది, అలానే వాసన్ ఐ కేర్ హాస్పిటల్ డాక్టర్లకు, ఉద్యోగస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇక్కడి ఇన్చార్జి డాక్టర్ రవి కుమార్, గ్లకోమ డాక్టర్ తదితరులు పాల్గొన్నారు.