షడ్రుచుల మిళితమైన ఉగాది పచ్చడి వితరణ

శ్రీ శోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మనికొండ మునిసిపల్ కౌన్సిల్ అంతర్భాగం అయిన సెక్రెట్రియేట్ కాలనీలోని గోల్డెన్ టెంపుల్ సర్కిల్ లో బుధవారం ఉదయం 11 గంటలకు వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో మంచి నీటి చలివెంద్రమ్ ప్రారంభోత్సవంతో పాటు చల్లటి మజ్జిగ వితరణ చేసినారు, తదుపరి అందె లక్ష్మణ్ రావు ద్వారా షడ్రుచుల మిళితమైన ఉగాది పచ్చడి వితరణ కూడా చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంన్ని శోభాయమానంగా శుభప్రదం చేయడంలో సంస్థ అధ్యక్షుడు బత్తుల బాపూజీ, ప్రధాన కార్యదర్శి సీతారామ్ దాస్, కోశాధికారి దిలీప్ కక్కడ్, సభ్యులు నిర్మల్ గొలేచ, పీ ఎస్ వీ కుమార్, అందె లక్ష్మణ్ రావు, సాంబ శివ రావు, జీ వీ సూర్యనారాయణ, సాదు నాగేంద్ర రావు, కన్నయ్య, మోహన్ రావు, ఎస్ ఎన్ హల్దార్, డాక్టర్ ప్రభావతిలు తమ వంతు సహాయ సహకారాలను అందించారని సంస్థ అధ్యక్షుడు తెలుపుతూ ఈ శుభ సంధర్బంగా అందరు సకుటుంబ సపరివార సమేతంగా రాబోయే సంవత్సరమ్లో ఆయూర్ ఆరోగ్యాలతో సుఖంగా జీవించాలని ఆ దేవ దేవుని ప్రార్థించినారు, సంస్థ యొక్క ప్రతి పనిలో కీలక పాత్ర వహించి ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడిని స్వతహాగా వితరణ చేసిన అందె లక్ష్మణ్ రావు సేవలను కొనియాడిననారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking