ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 26 : హరిత హారం దేశానికే ఆదర్శం ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పిలుపునిచ్చారు.శనివారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట స్థానిక ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో హరితహారం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే స్థానిక నాయకులు,విద్యార్థులు, అధ్యాపకులతో తో కలిసి మొక్కలు నాటారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…సీఎం కేసీఆర్ ముందు చూపుతో 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రం హరితహారం వలన పచ్చదనంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.బెంగళూరు లాంటి ప్రదేశాల్లో ఉండే చల్లని వాతావరణం నేడు తెలంగాణలో కనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశారు.అంతే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ,అభివృద్ధి పథకాలతో తెలంగాణ దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. మంచిర్యాల ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచడమే తన ధ్యేయమని వివరించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య మాట్లాడుతూ…హరితహారం ఒక గొప్ప కార్యక్రమమని కొనియాడారు.చెట్లతో పర్యావరణ పరిరక్షణ సాధ్యమన్నారు.అనంతరం వైస్ చైర్మన్ పోడేటీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు బహుమతిగా ఇవ్వడం మన బాధ్యత అని గుర్తు చేశారు.చెట్లతోనే మానవ మనుగడ అని వివరించారు. అంతకు ముందు ప్రిన్సిపాల్ డాక్టర్ జై కిషన్ ఓజా మాట్లాడుతూ…ప్రతి ఏటా కళాశాల లో హరిత హారం భారీ ఎత్తున నిర్వహిస్తున్నామని, విద్యార్థులకు పర్యావరణం పై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.కళాశాల లో విద్యార్థులకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని ప్రిన్సిపాల్ ఓజా ఎమ్మెల్యే దివాకర్ రావు,మున్సిపల్ చైర్మన్ కాంతయ్య ను కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు.కాంట్రాక్టు లెక్చరర్స్,గెస్ట్ లెక్చరర్స్, బోధనేతర సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కు వినతిపత్రం అందజేశారు. కళాశాలకు అనుబంధంగా నడుస్తున్న బీసీ హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ రాజ్ కుమార్, కౌన్సిలర్లు ఒరగంటి శ్రీకాంత్, రాజన్న,మెట్టు కళ్యాణి రాజు, సురేష్ నాయక్,కో-ఆప్షన్ సాహిద్ అలీ,బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, మున్సిపల్ మేనేజర్ శ్రీహరి,వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ గంగయ్య, అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.