కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన,ఎమ్మెల్యే దివాకర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 19 : మంచిర్యాల జిల్లా లోని లక్షెటిపేట పట్టణంలోని కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు.గురువారం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల లో కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్రంలో కంటి వెలుగు అనే కార్యక్రమాన్ని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతో అభినందించడం జరిగిందన్నారు. కెసిఆర్ ప్రభుత్వంలో ప్రజల బాగోగుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చిన ఘనత కెసిఆర్ అని అన్నారు. అంతకుముందు అసిస్టెంట్ కలెక్టర్ రాహుల్ శిబిరాన్ని సందర్శించి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షుడు చుంచు చిన్నన్న,పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్,మాజీ డిసిఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు సురేష్ నాయక్,దొంత నర్షయ్య,మోత్కూరి వెంకటస్వామి గౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking