ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 08 : యువకులు, మహిళలు మద్దతు లేకపోతే ఏ పార్టీ మనుగడలోకి రాదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మనాయక ఫంక్షన్ హాలులో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యువగళం సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. యువకులు దేశానికి పట్టుకొమ్మలని కొనియాడారు. యువకులు,మహిళలు ఓటు వేసి ఆదరిస్తేనే పదవి దక్కుతుందని స్పష్టం చేశారు.మతం పేరుతో ఓట్లు అడగడం సహేతుకం కాదని ఆయన హితవు పలికారు. మతం,కులం పేరుతో విద్వేషాలు రగిలించాలని యత్నిస్తున్న పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మంచిర్యాల లో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే చర్యలకు పూనుకుంటానని భరోసా ఇచ్చారు.ఇండస్ట్రీ పార్కు ఏర్పాటు చేసి తద్వారా యువకులకు ఉద్యోగాలు, ఉపాధి మార్గాలను కల్పిస్తానని అన్నారు. సామాన్యులకు ఉన్నత వైద్యం అందించడానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తానని పునరుద్ఘాటించారు.పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆరెస్ కనుమరుగు కావడం తథ్యమని చెన్నూర్ ఏమ్మెల్యే వివేక్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధిస్తుందని ఆయన అన్నారు. నరేంద్రమోదీ దేశ సంపద, వనరులను అంబానీ,ఆధానీలకు కట్టపెడుతున్నాడని ధ్వజమెత్తారు.మోదీ హయాంలో నిత్యా వసర సరుకుల ధరలు, చమురు,వంట గ్యాస్,వంట నూనెల ధరలు ఆకాశానికి ఎగురాయనని ఎద్దేవాచేశారు. నాకుమారుణ్ణి ఎన్నికల్లో గెలిపించేందుకు దీవెనలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యువకుల అండ కాంగ్రెస్ కు పుష్కలంగా ఉందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు. ఎన్నికల్లో యువకుల పాత్ర ఎంతో ఉందని ఆమె గుర్తు చేశారు. యువకుడునైన తనను గెలిపిస్తే అన్నివిధాలుగా యువతకు అండగా నిలుస్తానని పార్లమెంట్ అభ్యర్ధి గడ్డం వంశీ హామీ ఇచ్చారు.ఈసమావేశంలో నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.