అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంత ఆస్తి అంతా కన్నా కాదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 12 : అయోధ్యలో శ్రీరాముడు బీజేపీకి సొంతం కాదు ఆస్తి అంతకన్నా కాదని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.శుక్రవారం తననివాస గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే బీజేపీ తీరును నిశితంగా ఆక్షేపించారు. శ్రీరాముని పేరుతో ఓట్ల రాజకీయం చేయడం శోచనీయం అని అన్నారు.శ్రీరాముడు ప్రపంచంలోని ప్రతి హిందువు ఆరాధ్యదైవమని అన్నారు. కాంగ్రెస్ హిందువు,శ్రీరామునికి వ్యతిరేకమనే ప్రచారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలనే బీజేపీ కుట్రను ఖండించారు.శ్రీరాముని కల్యాణం తరువాత అక్షింతలను పంచడం ఆనవాయితీ కాగా విగ్రహాల ప్రాణప్రతిష్ఠ ముందు అక్షింతలను పంచడం విడ్డురంగా ఉందని విమర్శించారు.కాంగ్రెస్ హయాంలో అనేక హిందువు దేవాలయాలు,శ్రీరాముని ఆలయాలు నిర్మాణం జరిగాయని ఆయన విషదీకరించారు. ఇప్పటికైనా బీజేపీ శ్రేణులు దేవుని పేరుతో సెంటిమెంట్ రగిలించి ఓట్లు పొందాలనే ఆలోచనకు స్వస్తిపలకాలని సూచించారు.సెంటిమెంట్ ను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలనే కేసీఆర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా నరేంద్రమోదీ ఓటమి చెంది రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ప్రేమ్ సాగర్ రావు అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking