ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 12 : ప్రజాబలం క్యాలెండర్ ను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆవిష్కరించారు.శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజాబలం దినపత్రిక ప్రజాదరణ పొందుతుందని అన్నారు. ప్రజాబలం దినపత్రిక మున్ముందు ప్రజలకు ఎంతో చేరువగా కావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎస్ వేణుగోపాల్,పీసీసీ సభ్యులు కొండా చంద్ర శేఖర్, పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మమ్మద్ ఖలీద్,బ్లాక్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.