లక్ష ఓట్ల మెజారిటీతో గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 08 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…రైతు భరోసా గురించి మాట్లాడుతూ, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ధరణి కాలం గురించి కమిటీ వేసి త్వరలోనే ఇస్తాం,వచ్చే వర్షాకాలంలో కౌలుదార్లకు పట్టదారులకు తప్పకుండా ఇస్తామని తెలిపారు,దీంతోపాటు 500 బోనస్ ఇస్తాం,రైతు కూలీలు 100 రోజుల పని చేసేవారికి ప్రతి కుటుంబానికి జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 12 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తెలిపారు,దీనిని 2 సార్లు ఇస్తామని తెలిపారు.6 గ్యారంటీలో అందులో ఉచిత బస్సు గురించి ఆడపడుచులను వెళ్తున్నారని అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా అర్హులైన అందరికీ నాలుగు వేల పింఛన్ ఇస్తామని తెలిపారు.మీ కుటుంబంలో ఒక సభ్యునిగా నన్ను ఎలాగైతే ఆదరించి నన్ను ఎలాగైతే గెలిపించారో అదేవిధంగా మన నియోజకవర్గ నుండి గడ్డం వంశీ కృష్ణ ను చేతి గుర్తుకు ఓటు వేసి లక్ష ఓట్ల మెజార్టీ గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లోమరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ముద్దసాని వేణు,ఎంపిటీసీ ముత్తే రాజన్న,మాజీ ఎంపిటీసి మోట పలుకుల గట్టయ్య,నాయకులు ముత్తే వేంకటేష్,కారుకూరి సత్తయ్య,మోటపలుకుల సత్తయ్య,జనార్దన్ రెడ్డి,కారుకూరి బాలయ్య,గోపతి తిరుపతి రవి,మల్యాల చంద్రమౌళి, మునిమడుగుల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ మగం మాన్కు,అప్పని సత్తయ్య,కొక్కిస ప్రసాద్,దొడ మధుకర్,కొట్టే శ్రీనివాస్, ముద్దసాని పెద్దయ్య చింతం లచ్చన్న,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking