రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 08 అక్టోబర్ 2023: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మైలార్దేవపల్లి డివిజన్, కట్టేదాన్ లో జయదేవ్ హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా హెల్త్ క్యాంప్ వల్ల చుట్టు పక్కల పేద ప్రజలకు, దగ్గరలో వున్న సంస్థలలో పనిచేసే కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మెగా హెల్త్ క్యాంప్ ను నిర్వహించిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో బీ.ఆర్.యస్ డివిజన్ ప్రెసిడెంట్ ప్రేమ్ గౌడ్, యూత్ ప్రెసిడెంట్ రఘు యాదవ్, డివిజన్ నాయకులు సరికొండ వెంకటేష్, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.
