మంచిర్యాల నియోజకవర్గ రైతాంగం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 18 : ఎల్లంపల్లి ప్రాజెక్టులో కనిష్ట స్థయికి నీటి మట్టం పడిపోయిన గానీ మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని ఎండిపోతున్న వరి పంటను గూడెం లిఫ్టు ద్వారా సాగు నీరు అందించి నియోజక వర్గ రైతాంగం ను ఆదుకున్న అపర భగీరథుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని మంచిర్యాల నియోజక వర్గ రైతాంగం అన్నారు.గురువారం నాడు కడెం కాలువ 30 వ డిస్ట్రిబ్యూటర్ వద్ద సాగు నీటి కాలువలో దిగి ప్రేమ్ సాగర్ రావు చిత్రపటానికి జల అభిషేకం చేశారు.ప్రేమ్ సాగర్ రావు జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ మమ్ములను ఆదుకున్న ఆపత్ బందవుడు ప్రేమ్ సాగర్ రావు.అని కొనియాడారు.ఈ కార్యక్రమం లో వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ జి పి ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి ఎపిటీసీ ముత్యాల శ్రీనివాస్,నాయకులు మహేందర్,దండేపల్లి, మండలంలోని మామిడిపల్లి, గ్రామంలో నాయకులు వివిధ గ్రామాల ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.